
భువనేశ్వర్ : ఒడిశా రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా సుందర్‌గఢ్ జిల్లాలో 11 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. కేసుల సంఖ్య 180కి చేరిందని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న 59 మంది శాంపిళ్లను పరీక్షించగా అందులో 11 మందికి వ్యాధి నిర్ధారణ అయిందని వెల్లడించారు. మొత్తం 180 కేసుల్లో 10 మంది బాధితులు ఒడిశా రాష్ట్రేతరులు కాగా.. 9 మంది ఇతర జిల్లాల నుంచి ఉన్నారని సుందర్‌గఢ్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ కన్హు చరణ్ నాయక్ తెలిపారు.