Nov 24,2022 16:23

ఢిల్లీ : ఐపీఎల్‌, దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటుతున్న హైదరాబాద్‌ యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మ బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లే భారత ఎ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ పర్యటనలో భాగంగా భారత-ఎ జట్టు.. బంగ్లాదేశ్‌-ఎతో నాలుగు రోజుల పాటు జరిగే రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ నెల 29 నుంచి డిసెంబర్‌ 2 మధ్య తొలి మ్యాచ్‌ జరుగుతుంది. డిసెంబర్‌ 6-9 మధ్య రెండో మ్యాచ్‌ను షెడ్యూల్‌ చేశారు. అభిమన్యు ఈశ్వరన్‌ కెప్టెన్సీలోని ఈ జట్టులో తిలక్‌ వర్మకు అవకాశం లభించింది. అతనితో పాటు యశస్వి జైస్వాల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, యశ్‌ ధూల్‌కు కూడా చోటు దక్కింది. రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత సీనియర్‌ క్రికెటర్లు చతేశ్వర్‌ పుజారా, ఉమేశ్‌ యాదవ్‌ తో పాటు ఆంధ్ర వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌ పోటీ పడనున్నారు.