Oct 05,2022 13:17

న్యూయార్క్‌ : ట్విట్టర్‌ను అమ్మేయండి.. కొంటా.. ముందుగా అనుకున్న రేటుకే డీల్‌ను పూర్తి చేస్తానని ఆఫర్‌ చేస్తూ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ కొనుగోలు విషయంలో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ లేఖ పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వార్తలతో ట్విటర్‌ షేర్‌ ఒక్కసారిగా దాదాపు 13 శాతం పెరిగి 47.95కి చేరింది. దీంతో షేర్లలో ట్రేడింగ్‌ ఆగిపోయింది. షేరు ఒక్కింటికి 54.20 డాలర్ల చొప్పున మొత్తం 44 బిలియన్‌ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేస్తానంటూ మస్క్‌ గతంలో ఆఫర్‌ ఇచ్చిన సంగతి విదితమే. ఆ తర్వాత వివిధ కారణాలు చూపి మస్క్‌ వెనక్కి తగ్గడంతో వివాదం కోర్టుకు చేరింది. ట్విట్టర్‌ను కొనుగోలు చేసేలా మస్క్‌ను ఆదేశించాలంటూ దాఖలైన పిటీషన్‌ .. ఈ నెలలో తదుపరి విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.