
సమంత ప్రధాన పాత్రలో నటించిన 'శాకుంతలం' ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ పలుమార్లు విడుదల తేదిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇక మహాశివరాత్రికి కచ్చితంగా వస్తుందంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మరోసారి వాయిదా వేశారు. కారణాలు చెప్పకుండా సినిమా వాయిదా వేయడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తపరుస్తున్నారు. త్వరలోనే సినిమా డేట్‌ను ప్రకటిస్తామంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు పోటీగా మరి ఏ సినిమా లేదు. పైగా మహాశివరాత్రి కావడంతో కొంచెం పాజిటీవ్ టాక్ వచ్చే అవకాశం ఉంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు సమర్పణలో గుణ టీంవర్క్స్ బ్యానర్‌పై నీలిమాగుణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది.