
కాలిఫోర్నియా (యుఎస్) : అమెరికాలో వరుస కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం అమెరికా కాలిఫోర్నియాలోని హాఫ్మూన్ బే నగరంలో రెండు చోట్ల కాల్పులు జరిగాయి ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరికొందరికి గాయలైనట్లు సమాచారం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇటీవల లాస్ఏంజెల్స్ సమీపంలోని మాంటేరీ పార్క్లో చైనీయుల లూనార్ నూతన సంవత్సర వేడుకలపైకి దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పది మందిని చంపాడు. మరోవైపు షికాగోలో తెలుగు విద్యార్థులపై నల్ల జాతీయులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన నందపు దేవ్శిష్ అనే విద్యార్థి మఅతి చెందగా, కొప్పాల సాయి చరణ్ అనే యువకుడు గాయాలపాలయ్యాడు. విశాఖపట్నానికి చెందిన లక్ష్మణ్ కాల్పుల నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు.