Jun 02,2023 09:50

ప్రజాశక్తి - భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు, రేపు రెండు రోజుల పాటు వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. నేడు 20 మండలాల్లో వడగాల్పులు వీయడనున్నట్లు తెలిపారు. అలాగే 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రెండు రోజులు పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.