Jan 31,2023 16:04

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : ఇటీవల తిరుపతిలో జరిగిన స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర స్థాయి ఫుట్‌ బాల్‌ పోటీల్లో శ్రీబాలాజీ జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థి పి.మహిమ స్వరూప్‌ ప్రతిభ చాటి వెండి పతకం సాధించినట్లు డాక్టర్‌ జ్యోతిర్మయి విద్యాసంస్థల అధినేత కెయస్‌ మురళీబాబు తెలిపారు. మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే లక్ష్యాలను సాధించవచ్చన్నారు. ప్రతిభ చాటిన విద్యార్థిని, తర్ఫీదు ఇచ్చిన వ్యాయామ ఉపాద్యాయుడు కె.సురేంద్రను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సభలో కళాశాల ప్రిన్సిపాల్‌ హనుమంతు, అధ్యాపక అధ్యాపక బృందం పాల్గొన్నారు.