Oct 03,2022 21:04

అహ్మదాబాద్‌: గుజరాత్‌ వేదికగా జరుగుతున్న 36వ జాతీయ క్రీడల్లో సోమవారం ఓ జాతీయ రికార్డు నమోదైంది. పురుషుల పోల్‌వాల్ట్‌లో సుబ్రమణి శివ జాతీయ రికార్డును నెలకొల్పాడు. పోల్‌వాల్ట్‌లో శివ 5.31మీటర్లు జంప్‌ చేసి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. అంతకుముందు 2018లో తన పేర ఉన్న 5.30మీటర్లుగా తిరగరాసాడు. 2018కుముందు తిరువనంతపురం వేదికగా జరిగిన జాతీయ క్రీడల్లో విజరు పాల్‌ సింగ్‌ 5.10మీ. పేర ఉన్న రికార్డును శివ తొలుత బ్రేక్‌ చేశాడు. ఇతర క్రీడాపోటీల్లో పురుషుల 10వేల మీ. పరుగులో గుల్వీర్‌ సింగ్‌(రైల్వేస్‌ 28నిమిషాల 54.29సెకన్లలో గమ్యానికి చేరి 2015లో తిరువనంతరంలో లక్ష్మణన్‌ నెలకొల్పిన 29నిమిషాల 13.50సెకన్ల రికార్డును బ్రేక్‌ చేశాడు. ఇక మహిళల 10వేల మీటర్ల పరుగులో హర్యానాకు చెందిన సీమ 33నిమిషాల 58.40సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా.. లాంగ్‌ జంప్‌లో నయనా జేమ్స్‌ 6.33మీటర్లు దూకి బంగారు పతకాన్ని ముద్దాడింది. ఫెపథ్లాన్‌లో స్వప్నా బర్మన్‌(మధ్యప్రదేశ్‌) 5663పాయింట్లు బంగారు పతకాన్ని సాధించింది.