
ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో దివాకర్ అధ్యక్షతన నార్పల మండలంలోని మొత్తం 17 పంచాయితీలో 2020 ఏప్రిల్ 1 నుండి 2021 మార్చి 31, 2021 ఏప్రిల్ 1 నుండి 2022 మార్చి 31 వరకు నార్పల మండలంలోని 17 పంచాయతీలలో జరిగిన 33 కోట్ల రూపాయల పనులకు సోమవారం సామాజిక నిర్వహించారు. ఇందులో 82 లక్షల 50 వేల రూపాయలను ఫైనాన్షియల్ డివియేషన్ గుర్తించారు. పంచాయితీలవారీగా అధికారులు ఉపాధి హామీ కూలీలు సంవత్సరంలో ఏ ఏ గ్రామంలో ఎన్ని పనులు జరిగాయి ? ఎన్ని నిధులు ఖర్చయ్యాయి ? వాటికి సంబంధించిన నివేదికలను స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్లు చదివి వినిపించి అధికారులకు నివేదికలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పి విజరు భాస్కర్, ఏపీ డి.సుధాకర్ రెడ్డి, ఎంపీపీ నాగేశ్వర్ రావు, జడ్పీ వైస్ చైర్మన్ జడ్పీటీసీ నగరత్నమ్మ, ఎంపీడీఓ దివాకర్, సింగిల్ విండో చైర్మన్ లోకనాథ్ రెడ్డి, నార్పల సర్పంచ్ సుప్రియ, గూగుడు సర్పంచ్ రమణ కుమారి, గంగనపల్లి, సర్పంచ్ కుళ్ళయా రెడ్డి సిద్రాచర్ల సర్పంచ్ రామాంజనేయులు, వైస్ ఎంపీపీ మలేశ్వరయ్య, ఎంపీటీసీ గొల్లపల్లి శంకర్ యాదవ్, కొత్తూరు పద్మాకర్ రెడ్డి, ఏపీవోలు ఓబన్న, లక్ష్మీకాంత బారు, ఏటీఎం తిప్పమ్మ, టెక్నీకల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అంబుడ్స్ మెన్ టీం సభ్యులు, ఉపాధి కూలీలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.