Oct 01,2022 12:18

ప్రజాశక్తి-బుచ్చయ్యపేట (అనకాపల్లి) : రేపు (ఆదివారం) గాంధీ జయంతిని పురస్కరించుకొని ... పూర్వ విద్యార్థులు, అమ్మ హెల్పింగ్‌ హార్ట్స్‌ ఆధ్వర్యంలో వడ్డాది జడ్పీ హైస్కూల్లో స్వచ్ఛంద మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సినీ హీరో జగపతిబాబు పిలుపునిచ్చారు. ఈమేరకు వడ్డాది సంస్థ యువకులను అభినందిస్తూ సెల్ఫీ వీడియో రిలీజ్‌ చేశారు. రక్తదానం సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. ఒకరు చేసే రక్తదానం మరొకరికి ప్రాణదానం కావాలని ఆకాంక్షించారు. అమ్మ పేరుతో అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. సంస్థ పేరులోనే సేవాతత్పరత కనిపిస్తుందని అభినందించారు.