
ప్రజాశక్తి-పీలేరు (రాయచోటి) : పీలేరు ఏపీఎస్‌ఆర్టీసీ డిపో నుంచి విహార, తీర్థ, విజ్ఞాన యాత్రల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లు కెవి రమణ, జి.ప్రమీల తెలిపారు. మంగళవారం ఈ మేరకు పీలేరు పట్టణంలో కరపత్రాలతో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ... డిపో మేనేజర్ బండ్ల కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 20న విహార యాత్రల కోసం కేరళలోని మున్నారుకు ఒక బస్సు, 25న మరో బస్సును నడుపనున్నట్లు చెప్పారు. 25న భద్రాచలం, మంత్రాలయం, శ్రీశైలం, తమిళనాడులోని వేళాంగిణి, హైదరాబాద్, ముచ్చంతల తీర్థ యాత్రల కోసం 40 సీట్ల అల్ట్రా డీలక్స్ బస్సు పీలేరు నుండి నడపనున్నట్లు తెలిపారు. పీలేరు నుండి మంత్రాలయం, మహానంది, అహౌబిలం, యాగంటి తీర్థయాత్ర కూడా ఉందని అన్నారు. విజ్ఞాన యాత్రలో భాగంగా ఈనెల 29న శ్రీహరికోటలో రాకెట్ లాంచింగ్ కార్యక్రమాన్ని వీక్షించడానికి కూడా ఓ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అందరికీ అందుబాటులో ఉండే టికెట్ ధరలపైప్ ఈ యాత్రలను చేపట్టామని, ఆసక్తిగలవారు త్వరగా తమ టికెట్లను నమోదు చేసుకోగలరని తెలియజేశారు. మరిన్ని వివరాల కోసం కె.వి.రమణ - 7893152748, జి. ప్రమీల - 7382878751 సెల్ నంబర్లకు సంప్రదించాలని కోరారు.