Jul 03,2022 21:45

హైదరాబాద్‌: టెస్టుల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్‌ జస్ప్రిత్‌ బుమ్రాను వెస్టిండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ బ్రియాన్‌ లారా ప్రత్యేకంగా అభినందించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శనివారం స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన 84వ ఓవర్‌లో బుమ్రా (4, 5 వైడ్స్‌, 6 నోబాల్‌, 4, 4, 4, 6, 1) దంచికొట్టాడు. దీంతో ఒకే ఓవర్‌లో మొత్తం 35 పరుగులు రాబట్టాడు. అయితే, లారా (2003), బెయిలీ (2013), కేశవ్‌ మహారాజ్‌ (2020) ఒకే ఓవర్‌లో 28 పరుగుల చొప్పున బాదారు. ఇప్పుడు బుమ్రా ఈ ముగ్గుర్నీ అధిగమించి కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే విండీస్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ ప్రత్యేకంగా ట్వీట్‌ చేసి మెచ్చుకున్నాడు.