
హైదరాబాద్ : వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎపి రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య టిడిపిలో చేరారు. మునిరామయ్య మంగళవారం టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. మునిరామయ్యతో పాటు ఆయన కుమారుడు ప్రవీణ్ కూడా టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వారికి చంద్రబాబు పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. హైదరాబాదులోని చంద్రబాబు నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. మునిరామయ్య 1985లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలిచి అసెంబ్లీకి వెళ్లారు. 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన మునిరామయ్య... టీడీపీ అభ్యర్థి బజ్జల గోపాలకఅష్ణారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు సొంత గూటికి చేరారు.