Oct 05,2022 16:27

ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : ఆదోని టూ టౌన్‌ సిఐగా శ్రీనివాస్‌ నాయక్‌ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న గుణశేఖర్‌ బాబు గత వారం క్రితమే బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ నాయక్‌ మాట్లాడుతూ.. కర్నూలు విఆర్‌ లో ఉన్న తనను సీఐగా నియమిస్తున్నట్లు గత వారంలో కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశిక్‌ ఉత్తర్వులు జారీ చేశారన్నారు.స్టేషన్‌ పరిధిలో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిఘా పెంచుతామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.స్టేషన్‌లో పోలీసుల సహకారంతో ప్రజలకు రక్షణ చర్యలు చేపడతామని వివరించారు.