Oct 05,2022 16:47

ప్రజాశక్తి-యద్దనపూడి (బాపట్ల జిల్లా) : గ్రామంలోని రామలింగెశ్వరస్వామి దేవాలయంలో దాతల సహకారంతో నిర్మించిన స్టోర్‌రూమ్‌, యాగశాలను విశ్రాంత ఉపాధ్యాయులు పేరయ్య బుధవారం ప్రారంభించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ... . దాతలు గొట్టిపాటి సుమన 3 లక్షలు, చింతపల్లి రాము 1.50 లక్షలు, బొప్పూడి హనుమంతరావు 10 వేలు గదుల నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన చర్చకుడు శేషయ్య, గ్రామ పెద్దలు భుషయ్య, జి శేషగిరిరావు, వీరయ్య, వేణు, అన్నపూర్ణమ్మ, రాముడు, ఉమ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.