Jan 31,2023 16:32

ప్రజాశక్తి-మైలవరం (ఎన్‌టిఆర్‌జిల్లా) : పరిపాలన చేయడం చేతకాక వైఫల్యం చెంది, ఆరున్నర లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని సీఎం జగన్‌ దివాలా తీయించారని, మాజీమంత్రి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తారకరత్నత్వరగా కోలుకోవాలని మంగళవారం నూజివీడు రోడ్‌లోని పలు ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతర ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాడేపల్లి ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి అభద్రతాభావంలో ఉన్నారన్నారు. 34,000 ఎకరాలు రైతులు, రైతు కూలీలు, మహిళలు, సామాన్యుల, సైతం రాష్ట్ర రాజధాని కోసం అమరావతి భూములు ఇచ్చారని, అటువంటి రైతులపై ఎస్సీ, ఎస్టీ, కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ఏ హక్కుతో విశాఖ రాజధాని అని చెబుతున్నారని ప్రశ్నించారు. బాబారు హత్య కేసులో ముద్దాయిలను కాపాడడానికి ఢిల్లీలో పైరవీలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.