Aug 19,2022 11:43

ప్రజాశక్తి - విజయనగరం టౌన్‌ : విద్యారంగ సమస్యల పరిష్కరిం కోరుతూ ఈనెల 23న జరిగే రాష్ట్రవ్యాప్త బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ అయ్యన్న పేటలో గల ఎస్‌కే డిగ్రీ కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ రూరల్‌ కమిటీ ఆధ్వర్యంలో బంద్‌ పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు రేవంత్‌, సతీష్‌లు మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమయ్యి నెలలు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పెండింగ్‌లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి నిధులు తక్షణమే విడుదల చేయాలని, సంక్షేమ హాస్టల్స్‌లో మెస్‌ చార్జీలు పెంచాలని, హాస్టల్స్‌కి సొంత భవనాలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతూ ఈనెల 23న రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలన్నీ కలిపి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.