Jan 24,2023 21:53

బెంగళూరు : మైక్రో మొబిలిటీ రంగ స్టార్టప్‌ స్టెల్లా మోటో విద్యుత్‌ స్కూటర్‌ రంగ వృద్ధిని ఒడిసిపట్టుకునేందుకు దేశ వ్యాప్తంగా తమ విస్తరణ ప్రణాళికలను వెల్లడించింది. జైడ్కా గ్రూపునకు చెందిన తమ సంస్థ తెలుగు రాష్ట్రాలు సహా కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. డీలర్లను ఆకర్షించేందుకు దరఖాస్తు ప్రక్రియను ఆన్‌లైన్‌ ద్వారా సరళీకృతం చేసినట్లు పేర్కొంది. దీంతో తమ వ్యాపార భాగస్వాములకు శిక్షణ, సర్టిఫికేషన్స్‌, మార్కెటింగ్‌ను అందించనున్నట్లు స్టెల్లా మోటో సిఇఒ, పౌండర్‌ నకుల్‌ జైడ్కా తెలిపారు.