
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : బాలకృష్ణ వంటి గుర్తింపు ఉన్న నాయకుడు నర్సుల పట్ల అలాంటి వ్యాఖ్యానాలు చేయడం సరికాదని, గతంలోనూ మహిళల పట్ల ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారని ఐద్వా రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రభావతి, రమాదేవి సోమవారం ప్రకటన విడుదల చేశారు. నర్సుల పట్ల చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పినట్లు తెలిసిందని, మంచిదేనని, అయినా మహిళల పట్ల చులకన వ్యాఖ్యలు పదే పదే చేయడం సరికాదని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.