Oct 03,2022 21:43

న్యూఢిల్లీ : బధిర బాలికకు మెడికల్‌ కోర్సులో ప్రవేశం నిరాకరించడంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ 1997 నిబంధనలను సవాలు చేస్తూ బాలిక వేసిన పిటీషన్‌పై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌, ఇతరులకు జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం సోమవారం నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నిబంధనల కారణంగా 40 శాతం బధిర లోపంతో బాధపడుతున్న బాలికకు ప్రవేశం నిరాకరించారని ధర్మాసనం తన నోటీసుల్లో తెలిపింది.