
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : టాలీవుడ్ హీరో తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన బెంగళూరులోని నారాయణ హదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను పరామర్శించారు. డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తారకరత్నకు మంచి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని, గురువారం నుంచి పురోగతి ఉండే అవకాశం ఉందని తెలిపారు. అన్ని విషయాలను బాబారు బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారని చెప్పారు. తారకరత్నకు గుండెపోటు వచ్చిన రోజు 45 నిమిషాల పాటు మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల నరాలు కాస్త దెబ్బతిన్నాయని, ప్రస్తుత పరిస్ధితి చాలా మెరుగ్గా ఉందని తెలిపారు.