Jan 31,2023 18:41

సీనియర్‌ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన 'సువర్ణసుందరి' చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫ్రీ రిలీజ్‌ ట్రైలర్‌, డిజిటల్‌ టికెట్‌ను దిల్‌ రాజు లాంచ్‌ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు. డాక్టర్‌ ఎమ్‌వికె రెడ్డి సమర్పణలో ఎస్‌ టీమ్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎమ్‌.ఎల్‌. లక్ష్మీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేంద్ర మాదారపు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఇంద్ర, రామ్‌, సాయికుమార్‌, కోట శ్రీనివాసరావు, నాగినిడు, అవినాష్‌, సత్యప్రకాశ్‌ తదితరులు నటించారు.