Oct 05,2022 15:01

ప్రజాశక్తి-పుత్తూరుటౌన్‌(చిత్తూరు) : దసరా మహోత్సవాల సందర్భంగా పుత్తూరు గ్రామ దేవత ఆరేటమ్మ అమ్మవారిని ఏపీ టూరిజం మినిస్టర్‌ ఆర్‌ కె.రోజా సోదరులు వై కుమార్‌ స్వామిరెడ్డి దర్శించుకున్నారు. తొలుత దర్శనానికి వచ్చిన స్మామి రెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ప్రసాదాలు అందజేసి, ఆమెను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మున్సిపల్‌ చైర్మన్‌ హరి, ఎంపీపీ ముని వేలు, కౌన్సిలర్‌ ఏకాంబరం, ఆలయ కమిటీ చైర్మన్‌ మనోహర్రెడ్డి, వైసిపి నాయకులు సీఎం దిలీప్‌ మొదలి, జై బాబు, కడియాల నాయుడు, చిరంజీవి, శివ, జై.కృష్ణ ,హేమంత్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.