Sep 22,2022 13:07

ప్రజాశక్తి-హైదరాబాద్ : జింఖానా మైదానం వద్ద తొక్కిసలాట జరిగింది. దీంతో ఆ ప్రాంతం వద్ద పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారింది. భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల కోసం అంచనాలకు మించి అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. వేలాదిగా వచ్చిన అభిమానులను నియంత్రించడం పోలీసులకు కష్టతరంగా మారింది. మెయిన్‌ గేట్‌ వైపు నుంచి ఒక్కసారిగా తోసుకుని రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో  తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మందికి పైగా అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. వీరిలో మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కొందరికి గాయాలు అయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి వైద్యం చేయిస్తున్నారు.