Jul 03,2022 13:27

ప్రజాశక్తి - నర్సాపురం రూరల్‌ (గుంటూరు) : నర్సాపురం నియోజకవర్గ టిడిపి ఇంచార్జి పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో నర్సాపురం స్థానిక బస్టాండ్‌ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నాటి నుంచి రాష్ట్రంలో ప్రజలపై రవాణాచార్జీల ధరలు పన్నుల ధరలు పెంచడం తప్ప వేరే అభివృద్ధి ఏమీ లేదంటూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మధ్యతరగతి, పేద ప్రజల నెత్తిన చార్జీల ధరలు పెంచుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు దేశంలోనే మన రాష్ట్రం అప్పుల్లోనూ, రాష్ట్ర ప్రజలపై పన్నులు పెంచడంలోనూ మొదటి స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కొప్పాడ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, అధికారి అనంతరామారావు, గుబ్బల నాగరాజు ,అందే రామకష్ణ, కొల్లు పెద్దిరాజు, తుమ్మలపల్లి లక్ష్మీనారాయణ, తోట సత్యానందరావు, సంకు భాస్కర్‌ నాయుడు, కోరాడ పాపారావు, పేండ్ర శ్రీను, ముస్కూడి రవి, తాడివాడ రమేష్‌, తిరుమణి శశిదేవి తదితరలు పాల్గొన్నారు.