
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) శాశ్వత ఆహ్వానితునిగా టి సుబ్బిరామి రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. అలాగే కుమారి సెల్జా, అభిషేక్ మను సింఘ్వీలను సిడబ్ల్యుసి సభ్యులుగా నియమించారు. ప్రత్యేక ఆహ్వానితునిగా అజరు కుమార్ లల్లును నియమించారు.