Aug 09,2022 12:11

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న చైనా.. గత వారం తైవాన్‌ చుట్టు పక్కల సముద్ర జలాలపై సైనిక విన్యాసాలు మొదలు పెట్టడం తెలిసిందే. ఈ సందర్భంగా తైవాన్‌ కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. తైవాన్‌ మంగళవారం సైనిక విన్యాసాలు మొదలు పెట్టింది. దక్షిణ తైవాన్‌లోని పింగ్‌ టంగ్‌ ప్రాంతంలో సైనిక విన్యాసాలు మొదలైనట్టు తైవాన్‌ ఎయిత్‌ ఆర్మీ కార్ప్స్‌ అధికార ప్రతినిధి లూవీ జే ధ్రువీకరించారు. వందలాది ట్రూప్‌లు, 40 హౌవిట్జర్లను ఇందులో భాగం చేశామని తెలిపారు.