Aug 09,2022 21:09

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వైసిపి ఎంపి గోరంట్ల మాధవ్‌ వీడియో ఘటనపై లోక్‌సభ స్పీకరు ఓం బిర్లాకు ఫిర్యాదు చేసినట్లు టిడిపి ఎంపిలు రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్‌ తెలిపారు. మంగళవారం కనకమేడల రవీంద్ర కుమార్‌ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిడిపి ఎంపిలు మాట్లాడారు. గోరంట్లపై చర్యలు తీసుకోవాలని స్పీకరును కోరామన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పీకరు చెప్పినట్లు తెలిపారు. జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఎంపి గోరంట్లను కాపాడాలని వైసిపి నేతలు యతిుస్తునాురని, ఈ వ్యవహారంపై వైసిపి నేతలు మాట్లాడటం లేదని, ఎంపి గోరంట్లపై చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నారని విమర్శించారు. గోరంట్ల వీడియో ఘటనను సజ్జల రామకృష్ణారెడ్డి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వైసిపిలో గోరంట్ల మాధవ్‌ ఒక్కరే కాదని, ఎంతోమంది ఉన్నారని అన్నారు. గోరంట్లపై చర్యలు తీసుకుంటే.. ఇతర వైసిపిలో సగం నేతలపైనా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. చర్యలు తీసుకుంటే వైసిపి మొత్తం ఖాళీ అవుతుందేమోనని భయపడుతున్నారని విమర్శించారు. వీడియో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపడానికి ఎన్ని రోజులు పడుతుందని నిలదీశారు. అమరావతి రాజధాని ఎక్కడికీ వెళ్లదని, విజయసాయిరెడ్డి పరోక్షంగా ఒప్పుకునే రాజ్యాంగ సవరణకు ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు పెట్టారని తెలిపారు. మూడు రాజధానులు పెట్టడానికి లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి లేకపోగా, తిరోగతి ఉందని విమర్శించారు. ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎందుకు రహస్యంగా కలిశారని, ఒకవేళ రాష్ట్ర సమస్యలపైనైతే మిగతా ఎంపిలను ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడారా? అని ప్రశిుంచారు. తాము ఎన్‌డిఎ అభ్యర్థులకు మద్దతు ఇవ్వలేదని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు స్వతంత్రంగా మద్దతు ఇచ్చామని తెలిపారు.