Dec 01,2022 21:03

ముంబయి : ప్రయివేటు రంగంలోని జీవిత బీమా సంస్థ టాటా ఎఐఎ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (టాటా ఎఐఎ) అంతర్జాతీయ కంపెనీ మెడిక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ''ఈ భాగస్వామ్యంతో టాటా ఎఐఎ యొక్క వినియోగదారులు స్ధానిక, అంతర్జాతీయ వైద్య నిపుణుల సలహాలతో అతి తీవ్రమైన అనారోగ్య సమస్యలను నిర్వహించుకోగలరు. ఈ సేవలను అర్హత కలిగిన జీవిత భీమా పాలసీలను టర్మ్‌, సేవింగ్స్‌, పెన్షన్‌ ప్లాన్‌ పాలసీదారులకు కాంప్లిమెంటరీగా అందిస్తారు. మెడిక్స్‌తో భాగస్వామ్యం ద్వారా మేము మా విలువ ప్రతిపాదనను మరింత వద్ధి చేసుకోవాలనుకుంటున్నాము.'' టాటా ఎఐఎ ఎండి, సిఇఒ నవీన్‌ తహిల్యానీ పేర్కొన్నారు.