Jun 23,2022 20:16

న్యూఢిల్లీ :  డిటిహెచ్‌ సేవలను అందిస్తున్న టాటా ప్లే కొత్తగా గృహా సెక్యూరిటీ సొల్యూషన్స్‌ విభాగంలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. గూగుల్‌ భాగస్వామ్యంలో బ్యాటరీ పవర్డ్‌ నెస్ట్‌ క్యామ్‌, నెస్‌ అవేర్‌ను అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా సెక్యూరిటీ సేవల్లోకి అడుగు పెట్టినట్లయ్యిందని తెలిపింది. దీంతో ఇళ్లకు అత్యాధునిక భద్రత పర్యవేక్షణ అందిస్తూ వ్యక్తులు, ప్రాణులు, వాహనాలు, పరిచయం ఉన్న ముఖాలను గుర్తించే ఇంటెలిజెంట్‌ అలర్ట్‌ తదితరాలను ఇది కలిగి ఉందని పేర్కొంది. ఈ సేవలు తొలుత హైదరాబాద్‌, ముంబయి, పూణె, చెన్సై, ఢిల్లీ తదితర నగరాల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది.