Aug 01,2022 19:07

బస్‌టెర్రె వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్‌ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది. రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ 10 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపింది.  మ్యాచ్ జరిగే బస్‌టెర్రెలోని వార్నర్ పార్క్‌కు రెండు జట్ల లగేజీ ఆలస్యంగా రావడంతో అనుకున్న సమయానికి మ్యాచ్ ప్రారంభం కావడం లేదని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. అనివార్య పరిస్థితుల కారణంగా ట్రినిడాడ్‌ నుంచి ఈరోజు మ్యాచ్ జరగనున్న సెయింట్ కిట్స్‌కు ఇరు జట్ల లగేజీ ఆలస్యంగా వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది.