Mar 19,2023 16:26

విశాఖ : ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో ఘన విజయాన్ని నమోదు చేసిన టీమ్‌ఇండియా రెండో వన్డేలో చతికిలపడింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌ సేన.. దాదాపు సగం ఓవర్లు (26 ఓవర్లు) మాత్రమే ఆడి 117 పరుగులకు ఆలౌటయ్యింది. స్టార్క్‌, అబాట్‌, ఎల్లీస్‌ పేస్‌ అటాక్‌ ముందు భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ వెలవెలబోయింది. కోహ్లీ(31), అక్షర్‌ పటేల్‌(29) ఆ కాస్త రాణించడంతో.. భారత్‌ స్కోరు వంద పరుగులైనా దాటగలిగింది. గిల్‌, సూర్య, షమీ, సిరాజ్‌ డకౌట్లు కాగా.. కేఎల్‌ రాహుల్‌, పాండ్య, కుల్‌దీప్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌ 5 వికెట్లతో విజఅంభించగా.. అబాట్‌ 3, ఎల్లీస్‌ 2 వికెట్లు పడగొట్టాడు.