Oct 02,2022 22:15

గౌహతి: టీమిండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. తొలి టీ20లో చావు దెబ్బ తిన్న సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో గెలిచి సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉంది. దక్షిణాఫ్రికా జట్టులో ఒక మార్పు జరిగింది. షంశీ స్థానంలో ఎంగ్డీకి చోటు దక్కింది. టీమిండియా జట్టులో ఎలాంటి మార్పు లేదు.
తొలి టీ20లో గాడిలో పడిన బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్న టీమిండియా ఇప్పుడు ఈ మూడు టీ20ల సిరీస్‌లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉన్న రోహిత్‌ సేన మరో మ్యాచ్‌ గెలిస్తే ఆ జట్టుపై తొలి సిరీస్‌ను గెలుచుకునే అవకాశం ఉంది. ఇందుకు ఆదివారం జరిగే రెండో టీ20ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది.
యువ బౌలర్ల అండతో..:నిజానికి ఈ సిరీస్‌ను టీ20 ప్రపంచకప్‌ జట్టుతో ఆడించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావించింది. కానీ అనూహ్యంగా బుమ్రా గాయంతో మెగా టోర్నీ సన్నాహకాలపై దెబ్బపడింది. ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌లను జట్టులోకి తీసుకున్నా ఈ ఇద్దరు టీ20 ప్రపంచకప్‌ టీమ్‌లో లేరు. మిగిలిన మ్యాచ్‌లు బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే బౌలర్‌ ఎవరో తేలుస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
టీమిండియా: కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), దినేష్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, హర్షల్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌
దక్షిణాఫ్రికా: క్వింటన్‌ డీ కాక్‌(వికెట్‌ కీపర్‌), బవుమా(కెప్టెన్‌), రిలీ రోసో, మార్‌క్రమ్‌, డేవిడ్‌ మిల్లర్‌, స్టబ్స్‌, పార్నెల్‌, కేశవ్‌ మహారాజ్‌, రబాడ, నోర్జే, లుంగి ఎంగ్డి