Aug 09,2022 07:56

యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్‌ లో పాల్గొనే టీమిండియాను నేడు ఎంపిక చేశారు. రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా, కేఎల్‌ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఫామ్‌ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి సెలెక్టర్లు జట్టులోకి స్థానం కల్పించారు. ప్రధానంగా, టీ20 వరల్డ్‌ కప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.కాగా, జస్ప్రీత్‌ బుమ్రా, హర్షల్‌ పటేల్‌ లను గాయాల కారణంగా పరిగణనలోకి తీసుకోలేదని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం వారు బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో కోలుకుంటున్నారని పేర్కొంది. ఇక, ఆసియా కప్‌ కోసం శ్రేయాస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చహర్‌ స్టాండ్‌ బై ఆటగాళ్లుగా కొనసాగుతారని బోర్డు వెల్లడించింది.
భారత జట్టు ఇదే...
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషబ్‌ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, యజువేంద్ర చహల్‌, రవి బిష్ణోయ్, భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌, అవేష్‌ ఖాన్‌.