Jun 23,2022 12:03

ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కు ముందు లీసెస్టర్‌షైర్‌ జట్టుతో నేటి నుంచి ప్రారంభమయ్యే వార్మప్‌ మ్యాచ్‌లో పలువురు టీమ్‌ఇండియా ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టు తరుపున ఆడనున్నారు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. రిషభ్‌ పంత్‌, ఛెతేశ్వర్‌ పుజారా, జస్ప్రిత్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కష్ట.. సామ్‌ ఇవాన్స్‌ నేతృత్వంలోని లీసెస్టర్‌ జట్టులో ఆడతారని వెల్లడించింది. టీమ్‌ఇండియా జట్టులోని ప్రతి ఒక్కరికీ ప్రాక్టీస్‌ లభించే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ, లీసెస్టర్‌ క్రికెట్‌ క్లబ్‌, ఈసీబీ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. గతేడాది ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో విరాట్‌ కోహ్లీ నేతత్వంలోని టీమ్‌ఇండియా 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఐదో టెస్టును డ్రా చేసుకున్నా.. విజయం సాధించినా భారత్‌ సిరీస్‌ సొంతం చేసుకోనుంది.