Jan 20,2023 09:41

తెలంగాణ కెనడా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తీన్మార్‌ సంక్రాంతి సాంస్కృతిక ఉత్సవాలు డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్‌ లో ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలలో 1500కు పైగా తెలంగాణవాసులు పాల్గొన్నారు. టిసిఎ స్పాన్సర్స్‌ దివ్య దొంతి, కస్తూరి ఛటర్జీ, మనస్విని వెలపాటి, శ్వేతా పుల్లూరి, శ్రేయ ఆకుల కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి తీన్మార్‌ సంక్రాంతి 2023 సంబరాలను ప్రారంభించారు. ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్‌ ట్రస్టీ వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో భోగి పళ్ళు పిల్లల సాంప్రదాయ వేడుకలు విచిత్ర వేషాధారణ, డ్రాయింగ్‌, పతంగుల తయారీ, క్విజ్‌, ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళా కమిటీ సభ్యులు రాధికా బెజ్జంకి, ప్రసన్న మేకల, మాధురిచట రాజు ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కెనడా అసోసియేషన్‌ 2023 టొరంటో తెలుగు క్యాలెండర్‌ ను ఆవిష్కరించి ముందుగా కమిటీ సభ్యులకు అందజేశారు. తీన్మార్‌ సంక్రాంతి ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి దీపా గజవాడ సహకారంతో కుమారి ప్రహళిక మ్యాకల, రాహుల్‌ బాలనేని ఐదు గంటలపాటు యాంకరింగ్‌ చేసి ప్రేక్షకులను అలరించారు.

తెలంగాణ కెనడా అసోసియేషన్‌ అధ్యక్షులు శ్రీనివాస్‌ మన్నెం మాట్లాడుతూ ... తెలంగాణ పండుగలని, సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకువెళ్లడానికి దోహదం చేస్తాయని వ్యక్తీకరించారు. శ్రీనివాస్‌ మన్నెం ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవముతో తెలంగాణ కెనడా అసోసియేషన్‌ టొరంటో కృషి చేస్తుందని తెలిపారు. ఈ ఉత్సవానికి వివిధ విభాగాలలో పోటీలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. సంక్రాంతి ప్రత్యేకంగా చేసిన స్కిట్‌, పలు నృత్య ప్రదర్శనలు, విచిత్ర వేషాధారణ ప్రేక్షకులను అలరింప చేశాయి వేడుకలో గెలిచినవారందరికీ చివరిలో బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినవారందరికీ రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం చివరిలో మహిళలకు పసుపు, కుంకుమ, తెలంగాణ ఫలహారాలతో కూడిన వాయనాలను అందజేసి తెలంగాణ కెనడా అసోసియేషన్‌ తన ప్రత్యేకతను చాటుకుంది.

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ మన్నెం, ఉపాధ్యక్షుడు మనోజ్‌ రెడ్డి, కార్యదర్శి శంతన్‌ నారెళ్ళపల్లి, సంయుక్త కార్యదర్శి రాజేష్‌ అర్ర, సాంస్కృతిక కార్యదర్శి దీపా గజవాడ, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల, కోశాధికారి వేణుగోపాల్‌ ఐల, సంయుక్త కోశాధికారి రాహుల్‌ బాలనేని, డైరెక్టర్లు నాగేశ్వరరావు, దలువాయి, ప్రవీణ్‌ కుమార్‌ శ్యామల, ప్రణీత్‌ పాలడుగు, శంకర్‌ భరద్వాజ పోపూరి, యూత్‌ డైరెక్టర్‌ కుమారి ధాత్రి అంబటి, బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ నవీన్‌ ఆకుల బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌ సభ్యులు మురళి సిరినేని, ప్రసన్న మేకల, మురళీధర్‌ కందివనం, మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్‌ అతిక్‌ పాషా వ్యవస్థాపక సభ్యులు దేవేందర్‌ రెడ్డి గుజ్జుల, కోటేశ్వరరావు చిత్తలూరి, కలీముద్దీన్‌ మొహమ్మద్‌, ప్రకాష్‌ చిట్యాల, అఖిలేష్‌ బెజ్జంకి, ప్రభాకర్‌ కంబాలపల్లి, శ్రీనివాస తిరునగరి, హరి రాహుల్‌, సంతోష్‌ గజవాడ, విజరు కుమార్‌ తిరుమలపురం, పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఉపాధ్యక్షుడు మనోజ్‌ రెడ్డి కృతజ్ఞతా వందన సమర్పణతో తీన్మార్‌ సంక్రాంతి వేడుకలు కెనడా టొరంటో లో ఘనంగా ముగిసినది.