
కావలి (నెల్లూరు) : కండక్టర్ భర్తపై బస్సు దూసుకెళ్లిన ఘటన నెల్లూరు జిల్లా కావలి ఆర్‌టిసి డిపోలో చోటుచేసుకుంది. భార్య సుభాషిణిని ఆమె భర్త సుబ్బరాయుడు ఆర్‌టిసి గ్యారేజీలో వదిలి తిరిగి బైకుపై వెళుతుండగా, బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే సుబ్బారాయుడు మృతి చెందాడు. ఆర్టీసీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.