
ముంబయి : మహారాష్ట్రలోని ముంబయిలో జరిగిన జి-20 రెండో దశ విపత్తు ప్రమాదం తగ్గింపు వర్కింగ్ గ్రూపు (డిఆర్‌ఆర్‌డబ్ల్యూజి) సమావేశాలు గురువారంతో ముగిసాయి. ఈ సమావేశాల్లో విపత్తు ప్రమాదాల తగ్గింపులో మౌలిక సదుపాయాల ప్రాముఖ్యత, ప్రమాదాల తగ్గింపు కోసం ఆర్థిక సహాయం అంశాలపై ప్రధానంగా చర్చించారు. విపత్తుల ప్రభావానిు తగ్గించడంలో సామాజిక రక్షణ వ్యవస్థల పాత్రను కూడా చర్చించారు. సమావేశంలో జిా20 దేశాలు విపత్తులను ఎదుర్కోవడంలో తమ కార్యక్రమాలను, కేస్ స్టడీస్‌ను పరస్పరం మార్పిడి చేసుకునాుయి. ఈ సమావేశంలో జి-20 దేశాల ప్రభుత్వ ప్రతినిధులతోపాటు డిఆర్‌ఆర్ నిపుణులు, ఐక్యరాజ్య సమితి సంస్థలకు చెందిన అధికారులు, బ్యాంక్‌ా ఆర్థిక రంగ నిపుణులు, పరిశోధనా సంస్థ నిపుణులు పాల్గనాురు. మొత్తంగా 122 మంది ప్రతినిధులు పాల్గనాురు. ఈ సమావేశం ప్రధానంగా వచ్చే మూడేళ్ల పాటు విపత్తులను ఎదుర్కోవడానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌పై చర్చించాయి. జిా20 మూడో దశ విపత్తు ప్రమాదం తగ్గింపు వర్కింగ్ గ్రూపు (డిఆర్‌ఆర్‌డబ్ల్యూజి) సమావేశాలు జులై 24 నుంచి 26 వరకూ చెనైులో జరగనునాుయి. జిా20 మొదటి దశ డిఆర్‌ఆర్‌డబ్ల్యూజి సమావేశాలు ఈ ఏడాది మార్చిాఏప్రిల్‌లో గాంధీనగర్‌లో జరిగాయి.