Jul 02,2022 10:49

రామ్‌ హీరోగా తమిళ దర్శకుడు లింగుసామి 'ది వారియర్‌' సినిమాను రూపొందించాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 14వ తేదీన తెలుగు,తమిళ భాషల్లో థియేటర్లలో రిలీజ్‌ చేయనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. తెలుగు ట్రైలర్‌ను బోయపాటి, తమిళ ట్రైలర్‌ను హీరో శివకార్తికేయన్‌ డిజిటల్‌ రిలీజ్‌ చేశారు. ఈ రెండు భాషలకి సంబంధించిన ట్రైలర్స్‌ యూట్యూబ్‌లో రెండు భాషల్లోని ట్రైలర్స్‌ కి ఇంతవరకూ 2.5 మిలియన్‌ ప్లస్‌ వ్యూస్‌ రావడం విశేషం.