Jun 24,2022 08:52

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు మార్కెట్లో టమోటా ధర క్రమేపి దిగివచ్చి సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తోంది. నెల కిందట సెంచరీ చేసిన టమోటా పక్షం రోజుల ముందు రూ.60-80 కు తగ్గింది. గత వారం రోజులు గా కిలో టమోటాలను 40 రూపాయలకు అమ్ముతున్నారు. రాష్షంలో పెద్ద మార్కెట్‌ అయిన మదవపల్లిలో కూడా టమోటా ఉత్పత్తి పెరగడంతో వచ్చే పక్షం రోజుల్లో రూ.20-30కు దిగుతుందని ఎఎంసి వ్యాపారి పోలిశెట్టి చెబుతున్నారు.