Aug 10,2022 10:34

వెదురుకుప్పం (చిత్తూరు) : భార్యను కత్తితో నరికి చంపాడో భర్త. స్థానిక సమాచారం మేరకు ... వెదురుకుప్పం మండలంలో బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఆలమడుగు హరిజనవాడలో నివసిస్తున్న సోకయ్యకు అతని భార్యకు మధ్య గొడవ జరిగిందని, భార్యను సోకయ్య కత్తితో నరికి చంపినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.