Oct 03,2022 22:08

ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో, న్యూఢిల్లీ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు ఉప ఎన్నిక నవంబర్‌ 3న జరగనుంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైది. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఆరు శాసనసభ స్థానాలకూ ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. అంధేరి ఈస్ట్‌ (మహారాష్ట్ర), మోకమా (బిహార్‌), గోపాల్‌గంజ్‌ (బిహార్‌), అదంపూర్‌ (హర్యానా), గోలగోఖరాుథ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), ధామ్‌నగర్‌ (ఒడిశా) స్థానాలకు కూడా నవంబర్‌ మూడున ఉప ఎనిుకలు జరగనున్నాయి. నవంబర్‌ ఆరున ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నట్లు ఇసి తెలిపింది. ఉప ఎనిుకల నోటిఫికేషన్‌ ఈ నెల ఏడున వెలువడనుంది. ఈ నెల 14వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 15న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్‌ 17 వరకూ ఇసి అవకాశం కల్పించింది.