
హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల కోసం మూడు కోట్ల మంది ఏకమై కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని వైఎస్సార్‌టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవరం సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. ప్రత్యేక రాష్ట్రంలోనూ ఉద్యమ ఆకాంక్షలు, ఆశయాలు కనుమరుగవుతున్నాయని విమర్శించారు. నియామకాల కోసం మొట్టమొదటగా పోరాటం చేసి గెలిచి, నిలిచింది వైఎస్సార్‌టీపి అన్నారు. నిరుద్యోగ దీక్షలతో సర్కారు మెడలు వంచి నోటిఫికేషన్లు ఇప్పించామన్నారు.
''నిధులు పక్కదారి పట్టి తెలంగాణ సంపద కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయితే ప్రశ్నించే గొంతుకగా వైతెపా నిలిచింది. వడ్డీ లేని రుణాలు, కేజీ టు పీజీ ఉచిత విద్య, నిరుద్యోగ భఅతి, దళితులకు మూడెకరాల భూమి వంటి వాగ్ధానాలపై గొంతెత్తింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే మరో ఉద్యమం జరగాలి. మళ్లీ వ్యవసాయం పండుగ కావాలన్నా, సొంతింటి కల నెరవేరాలన్నా.. వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలి. ప్రజలు అభివఅద్ధి బాట పట్టాలి. సబ్బండ వర్గాలకు సంక్షేమం చేరాలి'' అని షర్మిల పేర్కొన్నారు.