Aug 02,2022 15:22

భారత్‌-విండీస్‌ మధ్య జరిగిన రెండో టీ20 మూడు గంటల ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. విండీస్‌-భారత మధ్య మూడో టీ20 ఆలస్యంగా ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌.. ఇప్పుడు 9:30 గంటలకు మొదలుకానుంది. కాగా వరుసగా రెండు మ్యాచ్‌లు జరగనుండడంతో ఆటగాళ్ల విశ్రాంతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విండీస్‌ క్రికెట్‌ తెలిపింది. బీసీసీఐ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇక ఆలస్యంగా ప్రారంభమైన రెండో టీ20లో భారత్‌పై విండీస్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమమైంది.