Jun 22,2022 21:50

- గాయంతో రాణి రాంపాల్‌ దూరం
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే ఎఫ్‌ఐహెచ్‌ హాకీ మహిళల ప్రపంచకప్‌కు జట్టును హాకీ ఇండియా(హెచ్‌ఐ) మంగళవారం ప్రకటించింది. గాయం కారణంగా రాణి రాంపాల్‌ దూరం కావడంతో.. సవితా పునియాకు కెప్టెన్సీ పగ్గాలు హెచ్‌ఐ అప్పగించింది. టోక్యో ఒలింపిక్స్‌లో రాణి రాంపాల్‌ నేతృత్వంలో భారత జట్టు తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్న సంగతి తెలిసిందే. జులై 1నుంచి 17వరకు మహిళల హాకీ ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్‌, స్పెయిన్‌ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. గ్రూప్‌ాబిలో భారత్‌తోపాటు న్యూజిలాండ్‌, చైనా, ఇంగ్లండ్‌ జట్లు ఉన్నాయి. జులై 3న ఇంగ్లండ్‌తో మ్యాచ్‌తో టీమిండియా ప్రపంచకప్‌ పోటీల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
గోల్‌కీపర్స్‌: సవిత(కెప్టెన్‌), బిఛ్ఛూ దేవి కరిబమ్‌
డిఫెండర్స్‌: దీప్‌ గ్రేస్‌ ఎక్కా(వైస్‌ కెప్టెన్‌), గుర్జీత్‌ కౌర్‌, నిక్కీ ప్రథాన్‌, ఉదిత,
మిడ్‌ఫీల్డర్స్‌: నిషా, సుశీల, మౌనిక, నేహా, జ్యోతి, నవ్‌జ్యోత్‌ కౌర్‌, సోనిక, సలీమ
ఫార్వ్‌ర్డ్స్‌: వందన కటారియా, లాల్‌రిమిసిమి, నవ్‌నీత్‌ కౌర్‌, షర్మిలా దేవి
స్టాండ్‌ బై: అక్షతా అబసో, సంగీత కుమారి.