Oct 05,2022 16:06

అమరావతి: జగన్‌ అండతోనే టిడిపి కార్యకర్తలపై వైసిపి గూండాలు దాడులు చేస్తున్నారని,తమ కార్యకర్తల కుటుంబాల కన్నీళ్లకు కారణమైన వారిని వదలిపెట్టే ప్రశక్తే లేదని టిడిపి నేత అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎపిలో వైసిపి గూండాలు రెచ్చిపోతున్నారన్నారు. కర్నూలు బోయబంతిరాళ్లలో మాదన్న హత్యను ఖండిస్తున్నామని,కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని వైసిపి నేతలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.