
వరంగల్ : ఘట్ కేసర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ జాతీయ రహదారిపై బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతి, ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.