Sep 27,2022 08:11

ప్రజాశక్తి - మోతుగూడెం (అల్లూరి సీతారామరాజు జిల్లా) : వాగులో మునిగి ముగ్గురు విద్యార్థినులు మృతి చెందిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని శ్రీఅనుజ్ఞ హైస్కూలులో గుమ్మడి జయశ్రీ (14), సువర్ణ కమల (14), గీతాంజలి పదో తరగతి చదువుతున్నారు. విహారయాత్ర నిమిత్తం వీరు వేటపాలెం మండలం నుంచి చింతూరులోని సోకిలేరు వ్యూ పాయింట్‌ వద్దకు వచ్చారు. సోకిలేరు వాగులో స్నానం చేస్తుండగా ఒక్క సారిగా ముగ్గురు లోతులోకి వెళ్లిపోయారు. గమనించి స్థానికులు వారిని ఒడ్డుకు చేర్చారు. అయితే అప్పటికే వారు మరణించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహా లను చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.