
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్
లండన్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ పోరాటం ముగిసింది. మహిళల డబుల్స్ సెమీస్‌కు చేరిన ఏకైక జంట త్రీసా జోలీ-గాయత్రి గోపీచంద్ సెమీస్‌లో ఓటమిపాలయ్యారు. శనివారం జరిగిన సెమీస్ పోటీలో గాయత్రి-త్రీసా జోడీ 10-21, 10-21తో టాప్‌సీడ్ లీ-బెక్(కొరియా) చేతిలో వరుససెట్లలో ఓడారు. గత సీజన్‌లోనూ సెమీస్‌కు చేరిన ఈ యువ షట్లర్ల జోడీ ఈసారీ సెమీస్‌లోనే నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌ను భారత జోడీ కేవలం 46నిమిషాల్లోనే చేజార్చుకుంది.