Sep 16,2022 10:23

ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : మక్కువ మండలంలోని కన్నంపేట గ్రామపంచాయతీ సరిహద్దుల్లో పులి సంచారానికి సంబంధించిన పాదముద్రలను స్థానికులు శుక్రవారం ఉదయం కనుగొన్నారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మక్కువ ఎస్‌ఐ జి పైడిరాజు ఘటనా స్థలానికి వచ్చి అక్కడ పులి సంచరించినట్లు కనబడే పాదముద్రలను పరిశీలించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై అటవీశాఖ మండల అధికారి నారాయణరావు ప్రజాశక్తి తో మాట్లాడుతూ ... ఫారెస్ట్‌ బీట్‌ కానప్పటికీ కన్నంపేట నుంచి నరసింహ పేట గుచ్చిమి ఫారెస్ట్‌ బీట్‌ లో పులి సంచరించినట్లు పాదముద్రకుల జాడను బట్టి తెలుస్తోందని అన్నారు. ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి వచ్చిన వెంటనే మరింత సమాచారం అందిస్తామని వెల్లడించారు.